'బీజేపీ ఇంటింటి ప్రచారం' కార్యక్రమం

BDK: ప్రతీ ఇంటికీ వెళ్లి కేంద్ర పథకాలను వివరించాలని BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. 'ఇంటింటికి బీజేపీ' కార్యక్రమంలో భాగంగా బుధవారం పాల్వంచ మండలం జగన్నాధపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ 420 హామీలు 6 గ్యారెంటీలను విస్మరించి ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించారు. ఎక్కడ చూసినా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని అన్నారు.