కలెక్టర్ శ్రీధర్‌కు శుభాకాంక్షల వెల్లువ
2026 నూతన సంవత్సరం సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను జిల్లా అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ బంగ్లాలో కలెక్టర్ సతీమణితో కలిసి కేక్ కట్ చేసి సిబ్బందికి పంచిపెట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడుతో పాటు ఇతర శాఖల అధికారులు కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.