'పార్టీ గెలుపొందేందుకు కృషి చేయాలి'

'పార్టీ గెలుపొందేందుకు కృషి చేయాలి'

ములుగు జిల్లాలోని అన్ని సర్పంచ్, వార్డు స్థానాలలో బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బలరాం తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇవాళ జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలు సమన్వయంతో పని చేసి, ఎక్కువ స్థానాలు గెలుపొందేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.