వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

BHPL: విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి ప్రజలకు ఎమ్మెల్యే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటానన్నారు.