తండ్రి ఆస్తి ఇవ్వట్లేదనే బాధతో వ్యక్తి ఆత్మహత్య

తండ్రి ఆస్తి ఇవ్వట్లేదనే బాధతో వ్యక్తి ఆత్మహత్య

VKB: మోమిన్‌పేట్ మండలం కేసారం గ్రామంలో విషాదం నెలకొంది. తండ్రి భూమి తన పేరు మీద మార్చలేదన్న మనస్తాపంతో నాగరాజు అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఉరివేసుకొన్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.