కవల శిశువులు మృతి.. ఆస్పత్రి వద్ద ఆందోళన

TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆస్పత్రిలో గర్భవతికి సిజేరియన్ చేయగా.. కవల శిశువులు మృతి చెందారు. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే కవలలు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నర్సులతో ఆపరేషన్ చేయించారని, తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.