గ్రానైట్ లోడుతో ట్రాక్టర్ బోల్తా

గ్రానైట్ లోడుతో ట్రాక్టర్ బోల్తా

NGKL: జిల్లా కేంద్రం సమీపంలోని తూడుకుర్తి వద్ద సోమవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాయితో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో రాళ్లన్నీ రోడ్డుపై పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గమనించిన స్థానిక వాహనదారులు వెంటనే స్పందించి రాళ్లను పక్కకు తొలగించి దారి సుగమం చేశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగలేదని సమాచారం.