INDW vs SAW: ఏది గెలిచినా చరిత్రే..!

INDW vs SAW: ఏది గెలిచినా చరిత్రే..!

WWCలో భాగంగా ఆదివారం నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికా- భారత్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఇంగ్లండ్‌పై గెలిచిన సౌతాఫ్రికా తొలిసారి తుది పోరుకు అర్హత సాధించింది. రెండో సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. తుది పోరులో ఈ రెండు జట్లలో ఏది గెలిచినా చరిత్రే కానుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, భారత్ ఒక్కసారి కూడా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని గెలవలేదు.