సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

KKD: ప్రత్తిపాడు మండలం బౌరువాక గ్రామానికి చెందిన పలువురు గ్రామ టీడీపీ నేతల ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిశారు. పెద శంకర్లపూడిలో టీడీపీ కార్యాలయంలో ఆమెను కలిసి తమ గ్రామ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. దీనికి ఆమె స్పందిస్తూ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.