రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

NLG: కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి సమీపంలో కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.