చెత్త సంపద కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కో ఆర్డినేటర్

SKLM: రణస్థలం మండలంలోని పైడిభీమవరం, జె.ఆర్ పురం చెత్త సంపద కేంద్రాలను డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ నిశ్చల గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ... సంపద కేంద్రాల ద్వారా సంపద సృష్టించుకోవాలని సూచించారు. అనంతరం ఐవీఆర్ఎస్ కాల్స్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.