రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: పాయల్ శంకర్

రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: పాయల్ శంకర్

ADB: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. బేలలోని పెన్ గంగా నది పరివాహక గ్రామలైన సాంగిడి, భేదోడా, మనియర్ పూర్ తదితర గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు.