'నీట్ పరీక్షకు 112 మంది గైర్హాజరు'

TPT: తిరుపతి జిల్లాలో నీట్ యూజీ- 2025 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. ఎసీఎస్ ఆర్ట్స్ కాలేజీ, పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 4,445 మంది విద్యార్థులకు 4,333 మంది హాజరయ్యారని చెప్పారు. 112 మంది పరీక్షలు రాయలేదని తెలిపారు.