SGF క్రీడా పోటీలు వాయిదా
అన్నమయ్య: రైల్వే కోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే SGF క్రీడా పోటీలను వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు AP స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి భానుమూర్తి రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్ -19 బేస్‌బాల్ టోర్నమెంట్‌ను తదుపరి ఏ తేదీల్లో నిర్వహించేది తెలుపుతామని స్కూల్ గేమ్స్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు తెలిపారు.