VIDEO: తడ్కల్‌ల్లో భారీ ర్యాలీతో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్
SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి ఇవాళ నామినేషన్ల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలిశాల సుగుణ భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. వారితో పాటు మూడు వార్డులకు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.