ఇంధన కొరతపై పుకార్లు నమ్మవద్దు: కమిషనర్
HYD: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంధన కొరతపై వచ్చే పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితి సాధారణంగా ఉందని, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. సరఫరాలో అక్రమాలు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని సూచించారు.