BREAKING: యుద్ధంలోకి ఫ్రాన్స్ ఎంట్రీ
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ కీలక ప్రకటన చేశారు. ఖతార్, కువైట్, UAEలతో ఉన్న రక్షణ ఒప్పందాల మేరకు తమ ఆస్తుల రక్షణకు 'చార్లెస్ డి గల్లె' విమాన వాహక నౌకను పంపిస్తున్నట్లు వెల్లడించారు. దీనితో పాటు ఎయిర్ వింగ్, రక్షణ ఫ్రిగేట్లను కూడా మోహరిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల్లో భద్రతను పటిష్టం చేయనుంది.