ఆ జిల్లాలో ఐదు రోజులు సెలవులు

KMM: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లా నీట మునిగింది. ఈ క్రమంలో భారీ వర్ష పరిస్థితుల నేపథ్యంలో ఆ జిల్లాలో విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అన్ని యాజమాన్య విద్యాసంస్థలు సెలవును ఖచ్చితంగా పాటిస్తూ సదరు సమాచారాన్ని వెంటనే విద్యార్థులకు, తెలియజేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.