ఉప్పలపాడులో దేవర కార్యక్రమం

KDP: జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడు గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు మాజీ శాసన సభ్యుడు డా.సుధీర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సుధీర్ రెడ్డిని గ్రామస్తులు సత్కరించారు. అనంతరం స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.