కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

కృష్ణా: గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో శుక్రవారం పటమట పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈరోజు వంశీబాబు, గంటా వీర్రాజును అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ అరెస్టుతో సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో మొత్తంగా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.