నీలకంఠేశ్వర ఆలయంలో ఘనంగా రుద్ర హోమం
NZB: నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఘనంగా రుద్ర హోమం నిర్వహించారు. ప్రతి మాసంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఈ హోమం జరుగుతుందని ఆలయ అర్చకులు సుహాస్ శాఖై తెలిపారు. రుద్ర హోమంలో పాల్గొనే భక్తుల కోరికలు తీరుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీందర్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.