పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే
VZM: తెర్లాం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఎమ్మెల్యే బేబీ నాయన సోమవారం సందర్శించారు.. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆసుపత్రి సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా, ప్రతీ నెల 9వ తేదీన గర్భిణీ మహిళలు ఆసుపత్రికి వచ్చినప్పుడు వారికి భోజన సదుపాయం కల్పించాలని కోరారు. అలానే కూర్చోడానికి ఆసుపత్రి సముదాయంలో ఒక షెడ్డును నిర్మించాలని కోరారు.