ఉత్తమ అవార్డు అందుకున్న ఎస్సై

ఉత్తమ అవార్డు అందుకున్న ఎస్సై

ప్రకాశం: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ దామోదర్ పోలీసు సిబ్బందికి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విధి నిర్వహణలో ప్రతిభను కనబర్చినందకు గానూ దోర్నాల ఎస్సై మహేష్ ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.