ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు: MLA

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు: MLA

NDL: డోన్ పట్టణంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ, డ్రైనేజీ పనులను సోమవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. మురుగునీటి శుద్ధి, పచ్చదనం పరిరక్షణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలన్నారు.