ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ
SRCL: జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం శరత్ మాక్సీ విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శిబిరాన్ని ప్రారంభించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీసుల ఆరోగ్యం ముఖ్యమని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.