మేయర్‌కు అభివృద్ధి పనుల ఆహ్వాన పత్రిక అందజేత

NLR: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో మే నెల 15వ తేదీన దాదాపుగా 339 అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నగర మేయర్ పోట్లూరి స్రవంతిని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మేయర్‌కు అందజేశారు.