సెటిల్‌మెంట్ పేరుతో రూ. కోటి డిమాండ్
NLG: నకిరేకల్‌లో ప్లాట్ సెటిల్‌మెంట్ పేరుతో మోసం జరిగిన ఘటన సంచలనంగా మారింది. సెటిల్‌మెంట్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న ముద్దం బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్లాట్ యాజమాని విక్రమ్ రెడ్డితో రూ.63 లక్షలకు ఒప్పందం కుదిరినా, రౌడీషీటర్ రాజేష్ పేరుతో అదనంగా మరో రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.