'థెరెసా పేరు తప్పుగా వాడితే చర్యలు'

'థెరెసా పేరు తప్పుగా వాడితే చర్యలు'

తమ స్వార్థం కోసం మదర్ థెరెసా పేరును తప్పుగా వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని కోల్‌కతాకు చెందిన 'మిషనరీస్ ఆఫ్ ఛారిటీ' హెచ్చరించింది. అనుమతి లేకుండా ఆమె పేరు వాడటం అంగీకారం  కాదంటూ.. నిధుల సమీకరణ, ప్రచారాల కోసం ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తన పేరును ఇలా వాడుకోవడానికి ఆమె ఎప్పుడూ ఇష్టపడలేదని, ఇకపై ఇలాంటివి ఆపేయాలని స్పష్టంచేసింది.