అంబులెన్స్‌లో పండంటి మగబిడ్డ జననం...

అంబులెన్స్‌లో పండంటి మగబిడ్డ జననం...

KDP: తొండూరు మండలం ఆకుతోటపల్లెకు చెందిన చిన్నఓబులమ్మకు ప్రసవ వేదనలు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ సుధీర్ కుమార్ అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. తల్లీబిడ్డలను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.