చెరుకుపల్లిలో బీఆర్.అంబేద్కర్‌కు నివాళులు

చెరుకుపల్లిలో బీఆర్.అంబేద్కర్‌కు నివాళులు

BPT: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జీవితం, సేవలు, త్యాగాలు భారత దేశానికి దారి చూపే దీపస్తంభం అని వైసీపీ రేపల్లె ఇంఛార్జ్ డా. ఈవూరు గణేష్ అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చెరుకుపల్లిలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడి హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిందన్నారు.