రోడ్డుపైకి వస్తున్న మురుగునీరు.. తప్పని ఇబ్బందులు
శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ జంక్షన్ పరిధిలో ఉన్న వీధిలోని కాలువలో ఉన్న మురుగునీరు రోడ్డుపైకి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, బాటచారులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలంగా కాలువ సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి వస్తుందని వారు తెలిపారు. మురుగునీరు కారణంగా దుర్వాసన వస్తోందని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.