'పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు తప్పనిసరి'
MDK: పట్టణంలోని పెట్రోల్ బంకులను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానందం శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో తాగునీరు, మూత్రశాలలు, డిజిటల్ చెల్లింపులు వంటి మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. రాందాస్ చౌరస్తాలోని యజ్ఞయ్య భారత్ పెట్రోలియం బంక్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. UPI సేవలు లేకపోవడం పట్ల మేనేజర్‌ను హెచ్చరించారు.