కరీంనగర్ నగరపాలక రిజర్వేషన్లు ఖరారు
KNR: రాబోయే పురపాలక ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 66 వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. బీసీలకు అత్యధికంగా 25 స్థానాలు దక్కగా, ఎస్సీలకు 7, ఎస్టీలకు ఒక వార్డు కేటాయించారు. మహిళలకు (జనరల్) 18 స్థానాలు దక్కాయి. తాజా కేటాయింపులతో నగరంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.