రైతుల వ్యతిరేకిగా రేవంత్ మాటలు: హరీష్

రైతుల వ్యతిరేకిగా రేవంత్ మాటలు: హరీష్

TG: రైతులపై CM రేవంత్ రెడ్డికి ఏ మాత్రం ప్రేమ లేదని హరీష్ విమర్శించారు. 99 రోజుల ప్రణాళిక అంటూ హడావిడి చేస్తున్నారే తప్ప రెండేళ్లలో ఏం చేశారని ప్రజల ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. పోయిన యాసంగికి బోనస్, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టారని.. వడగండ్లు, తుఫాన్ వల్ల నష్టపోయినవారికి పరిహారం చెల్లించకుండా రైతుల వ్యతిరేకిగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.