VIDEO: పోలింగ్ సరళిని పరిశీలించిన బాన్సువాడ సబ్ కలెక్టర్
KMR: బాన్సువాడ డివిజన్ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సబ్ కలెక్టర్ కిరణ్మయి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆమె, ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. ఆమె మాట్లాడుతూ.. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.