మొక్కజొన్న కొనుగోలు పై రాస్తారోకో చేసిన రైతులు

మొక్కజొన్న కొనుగోలు పై రాస్తారోకో చేసిన రైతులు

KMM: చింతకాని మండలం నాగులవంచలో మొక్కజొన్న కొనుగోలుపై రైతులు నేడు రాస్తారోకో చేపట్టారు. ఎకరాకు 26 క్వింటాళ్ల పరిమితిని ఎత్తివేసి, పండించిన మొత్తం పంటను మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం-బోనకల్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎస్సై వీరేందర్, సీఈవో శ్రీనివాసరావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.