'విద్యుత్ దీపాలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేయండి'

'విద్యుత్ దీపాలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేయండి'

RR: హయత్‌నగర్ డివిజన్ సిద్ధి వినాయక కాలనీవాసులు కార్పొరేటర్ నవజీవన్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంటర్నల్ లైన్స్, పలు వీధుల్లో సీసీ రోడ్లు, మంచినీటి పైపులైన్ సదుపాయం, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని తెలుపుతూ వినతి పత్రం అందజేశారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని కార్పొరేటర్ తెలిపారు.