స్కూళ్లలో తాగునీరు, పారిశుద్ధ్యంపై సీఎం ఆరా
AP: రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యంపై ఆరా తీశారు. హాస్టళ్లలో వసతుల మెరుగుపై సీఎంకు అధికారులు వివరించారు. మొత్తం 13 రకాల హాస్టళ్లలో వసతుల కల్పనపై చర్చించారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.