గణతంత్ర దినోత్సవ పరేడ్‌ రద్దు

గణతంత్ర దినోత్సవ పరేడ్‌ రద్దు

చమురు కొరతతో పాక్ అతలాకుతమలవుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఇంధన పొదుపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఈ నెల 23న జరగాల్సిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా పాక్ దినోత్సవాన్ని ఇస్లామాబాద్‌లో 31 గన్ సెల్యూట్‌తో, సాయుధ దళాల ప్రదర్శనలతో జరుపుకుంటారు. చమురు కొరతతో పరేడ్ రద్దు చేసినప్పటికీ జెండాను ఎగురవేస్తామని చెప్పింది.