చింతలపూడిలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం

ELR: చింతలపూడి నగర పంచాయతీలో గురువారం జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే అందించిన సేవలను విజయరాజు కొనియాడారు. వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.