'పటిష్ఠంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలి'

'పటిష్ఠంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలి'

ప్రకాశం: ఒంగోలు రూరల్ పరిధిలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలను జేసీ గోపాలకృష్ణ సందర్శించారు. డీఎస్సీ-2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పటిష్ఠంగా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట డీఈవో కిరణ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.