ఇసుక లారీలతో.. ట్రాఫిక్‌కు అంతరాయం

ఇసుక లారీలతో.. ట్రాఫిక్‌కు అంతరాయం

BDK: మణుగూరు మండలం సీఎస్‌పీ వద్ద ఇసుక లారీలు రోడ్డు పక్కనే నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని ఇవాళ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, కార్మికులు సకాలంలో వెళ్లే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ వారు హెచ్చరికలు జారీ చేసిన లారీ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా రోడ్డు పక్కనే లారీలు నిలుపుతున్నారని తెలిపారు.