VIDEO: యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహుల కళ్యాణం

యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించారు. యాగశాలలో సుదర్శన నరసింహ యాగం నిర్వహించి, స్వామివారిని గజవాహనంపై కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య పాంచరాత్ర ఆగమ శాస్త్ర పద్ధతిలో నిత్య కల్యాణం నిర్వహించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.