నందవరంలో గోపుర కలశ మహోత్సవం
KRNL: నందవరంలోని మాతా బంగారమ్మ దేవి ఆలయంలో నూతన గోపుర కలశం, ముఖద్వార ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు భారీగా పాల్గొన్నారు. వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ ఇన్‌ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.