'గోదావరి ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి'
ADB: జన్నారం మండలంలోని గోదావరి తీర ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ రాంపూర్ గ్రామ శివారుల్లో గోదావరి ప్రవహిస్తోంది. అక్కడ లోతైన ప్రాంతాలు ఉండటంతో ఫోటోషూట్‌కు వెళ్లిన వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.