పాలమూరు వర్సిటీ బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్!
MBNR: 'ఛలో అసెంబ్లీ' ముట్టడి నేపథ్యంలో పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు భరత్ బాబు, కో-ఆర్డినేటర్ నవీన్ రాజ్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి విద్యార్థి సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడుతోందని భరత్ బాబు మండిపడ్డారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.