కొండాపురం వెలుగు కార్యాలయంలో జాబ్ మేళా

KDP: కొండాపురంలోని వెలుగు కార్యాలయంలో గురువారం డిక్సన్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నాగప్రసాద్ తెలిపారు. మండలంలో పదో తరగతి, ఐటీఐ, ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. ఇందులో భాగంగా మార్కుల పత్రాలతో హాజరుకావాలని తెలిపారు. ఈ మేళా జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.