కుడుమూరు గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది'

కుడుమూరు గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది'

PPM: పాచిపెంట మండలం కుడుమూరు గ్రామంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు గ్రామంలో రైతులు పండిస్తున్న మొక్క జొన్న, పత్తి, వరి పంటలను పరిశీలించారు. పత్తి పంట వర్షాలు వలన దెబ్బతినే అవకాశం ఉందని, నీరు నిల్వ లేకుండా చేసుకొని నానో యూరియా పిచికారి చెయ్యాలన్నారు.