వైభవంగా బాపనమ్మ తల్లి అమ్మవారి హరిద్రాభిషేకం

తూర్పుగోదావరి: అనపర్తి పాత ఊరులో కొలువై ఉన్న అనపర్తి గ్రామదేవత బాపనమ్మ తల్లి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హరిద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని నది జలాలను కలశాల్లోకి సేకరించి అమ్మవారి మూలవిరాట్ కు స్వయంగా అభిషేకం నిర్వహించారు.