ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

SDPT: ప్రేమించిన యువతి దూరమవుతుందన్న మనోవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వలిమె భరతేజ్(26) కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి మరొకరితో పెళ్లి కుదరడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.